పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీఓఏలు ఐకేపీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ వేతనాలను రూ.20 వేలకు పెంచాలన్నారు. అలాగే, ఆరోగ్య భద్రత కార్డులు, అర్హులను సీసీలుగా పదోన్నతులు కల్పించాలని.. వీఓఏలకు ట్యాబ్‌లు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో వీఓఏల సంఘం కార్యదర్శి గుండన్న, కోశాధికారి స్వరూప, సహాయ కార్యదర్శి శ్రీశైలం, బేతయ్య, కవిత, పుష్ప, విజయలక్ష్మి, ఉమారాణి, స్వప్న, సంతోష, గంగ, పోచయ్య తదితరులు ఉన్నారు.


