బాయిల్డ్‌ మిల్లులకు తడిసిన వడ్లు | - | Sakshi
Sakshi News home page

బాయిల్డ్‌ మిల్లులకు తడిసిన వడ్లు

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

పాపన్నపేట(మెదక్‌): తడిసిన ధాన్యం బాయిల్డ్‌ మిల్లులకు తరలిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో పలు చోట్ల ధాన్యం తడిసిందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఆ ధాన్యం సైతం ప్రభుత్వం కొను గోలు చేస్తుందన్నారు. నిరుపేద యువతుల పెళ్లి ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొత్తం 104 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా ధాన్యం కొనుగోళ్లపై బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్‌, సర్పంచ్‌ పావని, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్‌లు శ్రీధర్‌, ఏగొండ, శ్రీశైలం, రజిత, భాగ్యమ్మ, గౌస్‌, సతీశ్‌, ప్రవీణ్‌, శివ్వయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రోహిత్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement