మెదక్ కలెక్టరేట్: లక్ష్యాలకనుగుణంగా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆర్డీఓ రమాదేవి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీఎల్‌ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధ్రువీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకతతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జూలై 25 వరకు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సమయంలో బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి, ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా వివరాలు సేకరిస్తారన్నారు. మరణించిన ఓటర్ల వివరాలను ధ్రువీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి, రికార్డులను నవీకరించాలన్నారు. బీఎల్‌ఓలు పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐఆర్ అధికారులు పాల్గొన్నారు.
ఆర్డీఓ రమాదేవి


