ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
మెదక్‌జోన్: బక్రీద్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయల్ 100కు వేగంగా స్పందించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి సంఘటనలు గమనించినా, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు సందీప్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రేణుకారెడ్డి, కృష్ణమూర్తి, మహేశ్, రామకష్ణ, శైలేందర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రేపటి నుంచి
నీటి నాణ్యతా పరీక్షలు
నర్సాపూర్: మున్సిపాలిటీలోని పలు ట్యాంకుల నుంచి సరఫరా అయ్యే నీటిని శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పరీక్షించనున్నట్లు కమిషనర్ సాయికుమార్ తెలిపారు. పట్టణంలోని నమాజ్‌గడ్డ, మటన్ మార్కెట్ వద్ద ఉన్న ట్యాంకుల నీటిని టెస్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఆయా ట్యాంకుల నుంచి 6, 7, 8 వార్డులతో పాటు 14వ వార్డు ప్రజలకు నీరు సరఫరా అవుతాయని, ఆయా వార్డుల ప్రజలు నీటిని తాగొద్దని కోరారు. నీటి నాణ్యత పరిశీలన కోసం పలు రకాల పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు.
మనోధైర్యం కోల్పోవద్దు


