పాపన్నపేట(మెదక్): విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆచరణ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రవీణ్, నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొడుపాక ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ తరఫున సమ్మర్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు పాఠశాలలో క్రీడలు, కెరీర్ గైడెన్స్, విద్య ప్రాముఖ్యత, నైతిక విలువలు, సృజనాత్మకత, డ్రాయింగ్, పెయింటింగ్ తదితర విషయాలపై అవగాహన పెంపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి నాయుడు, సర్పంచ్ పంకజ కాశీనాథ్, పీఈటీ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.


