రామాయంపేట(మెదక్): ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పశువుల కొట్టం, గడ్డివాము కాలిపోయాయి. అలాగే కొట్టంలో ఉన్న దూడ సజీవదహనమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని రాయిలాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన ల్యాగల ఆంజనేయులు పంట చేనులో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. మంటలు చెలరేగి గడ్డివాముతోపాటు పశువుల కొట్టం, అందులో ఉన్న దూడ మంటలకు ఆహుతైంది. మంటలు వ్యాపిస్తున్న క్రమంలో దూడ అరుపులు అక్కడికి సమీపంలో ఉన్న వారిని కదిలించాయి. కాగా మంటలు వ్యాప్తి చెందడంతో ఎవరూ కూడా దరిదాపుల్లోకి వెళ్లలేదు.
పశువుల కొట్టం, గడ్డివాము దగ్ధం
దూడ మృతి


