ప్రతి గింజా కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

చేగుంట(తూప్రాన్‌): ప్రతి రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని చేగుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంగళ్‌రావు అన్నారు. బుధవారం పులిమామిడి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం తరలింపునకు లారీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చివరిగింజ వరకు కొనుగోలు చేసి రైతులకు తగిన సహకారం అందిస్తామన్నారు. అన్ని గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త్వరగా తరలించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండలశాఖ అధ్యక్షుడు నవీన్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, రైతులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement