కరాటేలో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కరాటేలో విద్యార్థుల ప్రతిభ

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

కరాటేలో విద్యార్థుల ప్రతిభ నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాస్థాయి కరాటే కలర్‌ బెల్ట్‌ ఎగ్జామ్‌లో మెదక్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు మాస్టర్‌ దినకర్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని గుల్షన్‌ క్లబ్‌లో రెంజుకి షాటోకన్‌ స్పోర్ట్స్‌ కరాటే అఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు వి విధ మండలాల నుంచి వచ్చినట్లు చెప్పారు. బెల్ట్‌ ఎగ్జామ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కరాటే మాస్టర్‌ నగేశ్‌ బెల్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైష్ణవి, గణేశ్‌, అఖిల్‌, తణ్మయి, విహాన్‌, అంకిత్‌ తదితరులు పాల్గొన్నారు.

తూప్రాన్‌: మున్సిపల్‌ కో– ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ గణేశ్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో నలుగురి కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరుగనుందన్నారు. అర్హులు గడువులోగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. వివరాలకు మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement