పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం | - | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని పురాతన పర్యాటక ప్రదేశాలు పూర్వ వైభవం సంతరించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డెక్కన్‌ టైరెన్‌ స్వచ్ఛంద సంస్థ, మీర్‌ఖాన్‌ సభ్యులు, ఈడీఎం సందీప్‌, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్‌తో కలెక్టర్‌ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనుభవాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్‌ మేనేజర్‌ మధు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌, శ్రావణి, మేనేజర్‌ శ్రీవాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంగీతతో భూ సేకరణపై సమీక్షించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు 40 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు కలెక్టర్‌ తెలిపారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement