తూప్రాన్: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి డీలర్లకు సూచించారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను డివిజన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్ ప్రారంభమవుతు న్న నేపథ్యంలో యూరియా బ్లాక్ చేయకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సీఐ వెంకటరాజు గౌడ్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్ర యిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డీలర్ రోజువారీ క్రయవిక్రయాలను రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు స్టాక్ బోర్డు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఏ, ఏఈఓలు సంతోశ్, సింధు, డీలర్లు వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు జాబ్ కార్డులివ్వాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): అర్హులందరికీ ఉపాధి జాబ్ కార్డులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం నాయకులతో కలిసి మండల పరిధిలోని అజ్జమర్రిలో పర్యటించారు. ఈ మేరకు ఉపాధి పనులను పరిశీలించి, కూలీలతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలను రెండుసార్లు ఫొటో క్యాప్చర్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యని వాపోయారు. పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. చాలా మంది కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కూలీల సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 5న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి: కౌడిపల్లి ఫీడ ర్ పరిధిలో మరమ్మతుల కారణంగా కొల్చారం మండలంలోని అన్ని సబ్‌స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ మహ మూద్ తెలిపారు. అలాగే కౌడిపల్లి మండలంలోని గ్రామాలకు విద్యుత్ నిలిపి వేస్తున్నట్లు ఏఈ సాయికుమార్ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
పాలిసెట్ కౌన్సెలింగ్ షురూ
‘టీచర్ల సమస్యలు పరిష్కరించాలి’
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేటేడ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం సిద్దిపేట జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


