అన్‌లోడింగ్‌ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

అన్‌లోడింగ్‌ వేగవంతం చేయండి

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

నర్సాపూర్‌: వీలైనంత వేగవంతంగా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రక్రియ చేపట్టాలని అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ రైస్‌ మిల్లర్లకు సూచించారు. శుక్రవారం నర్సాపూర్‌లోని పలు రైస్‌ మిల్లులు, గోదాంలను పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా చేపట్టాలన్నారు. కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆయా రైస్‌మిల్లులు, గోదాంలలో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్‌ విధానం, వడ్ల స్వీకరణ, అన్‌లోడింగ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని కొనుగోలు కేంద్రాలు, రైసుమిల్లల పనితీరును పోలీస్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు అధైర్యపడొద్దన్నారు. పండుగల సమయంలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలున్నా పోలీస్‌ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఉన్నారు.

ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement