రామాయంపేట(మెదక్): కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని కాట్రియాల, లక్ష్మాపూర్, అక్కన్నపేట గ్రామాల్లో ధాన్యం కొను గోలు కేంద్రాలను సందర్శించారు. అధికారులు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు వేగవంతం అయ్యే లా చూడాలని ఆదేశించారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.


