డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
హవేళిఘణాపూర్(మెదక్): ఎండలు మండుతున్న వేళ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని సర్ధన పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే ఆస్పత్రిలో డెలివరీలు, మందులు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో వసతులు, వైద్య సేవలను గురించి తెలుసుకొని మండల వైద్యాధికారి వినయ్‌సుశీల్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తు తం మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.


