దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

May 28 2026 8:43 AM | Updated on May 28 2026 8:43 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ స్వరూప బుధవారం పేర్కొన్నారు. జిల్లాలోని 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల బాల బాలికలు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చి ఉండాలన్నారు. ఆవిష్కరణలు, క్రీడలు, సృజనాత్మకత, మంచి అభ్యాసన, సాంస్కృతిక కళలు, సాహాసం, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లోని డీడబ్ల్యూఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement