ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

నర్సాపూర్‌ రూరల్‌: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే తరలించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని చిన్నచింతకుంట కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్‌ మల్లేష్‌ గౌడ్‌ ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు నెలకు రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పట్టుకొని రాత్రి పగలు కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్సీకి విన్నవించారు. దీంతో ఎమ్మెల్సీ జేసీ, ఆర్డీఓలకు ఫోన్‌ చేసి వెంటనే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించాలని తెలిపారు. దీనికి అధికారులు స్పందిస్తూ రెండు రోజుల్లో అన్ని కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించనున్నట్లు తెలిపినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వెంట ఎస్టీ మోర్చా నాయకుడు రాములు, తదితరులు ఉన్నారు.

విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

నర్సాపూర్‌: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్సీ అంజిరెడ్డి హెచ్చరించారు. ఆయన సోమవారం స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. ఆయా వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌, నాయకులు రఘువీరారెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, శ్రీకాంత్‌, నీరంజన్‌, సిద్దార్థ్‌, రాజు తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement