పౌర్ణమిని పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గమ్మకు శనివారం పల్లకీ సేవ నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీపై ఉంచి, దుర్గామాతకు జై అంటూ భక్తులు స్తుతిస్తుండగా, పల్లకీ సేవ మొదలైంది. ఆలయం వద్ద నుంచి గోకుల్ షెడ్డు వరకు యాత్ర కొనసాగింది. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
– పాపన్నపేట(మెదక్)
నాచగిరి.. వ్రతసిరి
సుప్రసిద్ధ నాచగిరి క్షేత్రం శనివారం సామూహిక సత్యదేవుని వ్రతాలతో శోభిల్లింది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించి వ్రతమండపం చేరుకుని భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. శ్రీవారికి అభిషేకం, కల్యాణం సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. – వర్గల్(గజ్వేల్)


