కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మండలాల వారీగా ధా న్యం సేకరణ గురించి అడిగి తెలుసుకు న్నారు. హమాలీలు, లారీల లభ్యత గురించి తహసీల్దార్లతో చర్చించారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగంగా జరగాలని సూచించారు. అన్‌లోడింగ్ ప్రక్రియలో హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. లారీలు అందుబాటులో లేకుంటే డీసీఎంలు, ట్రాక్టర్లను కూడా అనుమతించాలన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడడానికి టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలన్నారు. మిల్లర్లు అన్‌లోడింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి లారీలను అందుబాటులో తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఆయిల్‌పామ్ సాగుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందించేలా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం బక్రిద్ ఏర్పాట్లపై ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ సూ చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుందని ఎస్పీ వెల్లడించారు.
రైస్‌మిల్లర్లు సహకరించాలి
తూప్రాన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైస్‌మిల్లర్లు సహకరించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మున్సిపాలిటీ పరి ధిలోని ఓ రైస్‌మిల్లును మంగళవారం సందర్శించారు. కొనుగొలు కేంద్రాల ద్వారా రైస్‌మిల్లుకు వస్తున్న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులో వడ్ల మిల్లింగ్ ప్రక్రియ, నిల్వ సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాలు తదితర విషయాలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ ప్రేంకుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం మండలంలోని ఘనపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించారు.
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య


