ఆటో డ్రైవర్‌.. అదనపు కలెక్టర్‌.. ప్రయాణికురాలు.. కలెక్టర్‌ | medak-collector pratima singh rides electric auto additional collector drives | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌.. అదనపు కలెక్టర్‌.. ప్రయాణికురాలు.. కలెక్టర్‌

Jun 3 2026 8:14 AM | Updated on Jun 3 2026 11:22 AM

medak-collector pratima singh rides electric auto additional collector drives

మెదక్‌ కలెక్టరేట్‌: ఆటోలో కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ కూర్చోగా, అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆటో నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్‌ యోజన పథకం (ఏజీఈవై) కింద మెదక్‌ మండలం మక్తా భూపతిపూర్‌ గ్రామానికి చెందిన సంధ్యారాణికి ప్రభుత్వం రూ. 3.35 లక్షల విలువైన ఎలక్ట్రిక్‌ ఆటో మంజూరు చేసింది.

 మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆమెకు ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, లబ్ధిదారురాలు సంధ్యారాణి ఆటోలో కూర్చోగా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆటోను నడిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మహిళలు రవాణా రంగంలోకి ప్రవేశించడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement