రామాయంపేట(మెదక్): జిల్లాలో ప్రథమంగా జొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించారు. సీవిల్ సప్‌లై ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేశారు. మండల పరిఽధిలో ఈ ఏడాది పెద్ద ఎత్తున జొన్న పంట సాగు చేశారని, రైతులు దళారులకు విక్రయించకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవి, మద్దెల మాధవి, బైరం స్వప్న, తహసీల్దార్ రజని, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రాధాభవాని, గౌస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సీఈఓ నర్సింలు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి, తదితరులు పాల్గొన్నారు.


