మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలోని 14వ వార్డు నవాబుపేట వీధిలో స్థానిక కౌన్సిలర్ దొంతి లక్ష్మి– ముత్యంగౌడ్ దంపతులకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై కౌన్సిలర్ దొంతి లకి్‌ష్మ్‌ముత్యంగౌడ్‌లను ఘనంగా సన్మానించారు. అనంతరం నరేష్‌గౌడ్ మాట్లాడుతూ.. తమకు ఓటు వేసి గెలిపించిన రెడ్డి కుల సంఘం పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కులసంఘం పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.


