మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శ్యామ్‌లాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిల్లుల్లో ధాన్యం దిగుమతులు, నిల్వ, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో ధాన్యాన్ని విక్రయిస్తున్నట్లు చెప్పారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్‌న్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని, వాహనాలు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మిల్లర్లకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, మార్కెటింగ్ డీఎం అభిషేక్, సివిల్ సప్లై డిప్యూటీ కమిషనర్ కొండల్‌రావు, బాయిల్డ్ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ చంద్రపాల్, రామిల్లర్స్ ప్రెసిడెంట్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.
సివిల్ సప్లై డైరెక్టర్ శ్యామ్‌లాల్


