తడిసిన ప్రతి గింజా కొంటాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ప్రతి గింజా కొంటాం

May 28 2026 8:43 AM | Updated on May 28 2026 8:43 AM

నర్సాపూర్‌ రూరల్‌: అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మ ండలంలోని తుల్జారాంపేట కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా 400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసిందని క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చిన రిపోర్టు ద్వారా తెలిసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం వరకు 250 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పుకార్లు నమ్మి మధ్యవర్తులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేశా రు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

18 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో 18 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. బుధవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు తరలించే ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు, గన్నీ సంచుల లభ్యత, కాంటా పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న ధాన్యం బస్తాల వివరాలు, రిజిస్టర్‌ నిర్వహణ, తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement