మున్సిపల్ కమిషనర్ సాయికుమార్
నర్సాపూర్: మృగశిర కార్తె నాడు పట్టణంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ పాలక మండలి స్థలాన్ని నిర్ణయించినట్లు కమిషనర్ సాయికుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక పీఆర్ కార్యాలయం నుంచి రైతు వేదిక వరకు ఉన్న జాతీయ రహదారిపై చేపల దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకు వ్యాపారులందరూ తమ చేపల దుకాణాలను అక్కడే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పోలీసులు
పట్టించుకోవడం లేదు..
మెదక్ కలెక్టరేట్: తన ఫ్యాక్టరీలో జరుగుతున్న దొంగతనాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి, టీఎం ట్రేడర్స్ ప్రొప్రైటర్ ఖాలేక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు నర్సాపూర్ పట్టణంలో టీఎం ట్రేడర్స్ అనే ఫ్యాక్టరీ ఉంది. అందులో పలుమార్లు దొంగతనాలు జరిగినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ పుటేజీలు ఇచ్చిన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి దొంగలను పట్టుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
చిన్నశంకరంపేట(మెదక్): ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నార్సింగి మండలంలోని శేరిపల్లి, సంకాపూర్ గ్రామాల లబ్ధిదారులకు చిన్నశంకరంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, మాజీ జెడ్పీటీసీ రమణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొర్విపల్లి సర్పంచ్ పుల్లారావు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భరత్, నాయకులు లక్ష్మీనర్సింహులు, వార్డు సభ్యులు లక్ష్మి, నవనీత పాల్గొన్నారు.
మహిళా కౌన్సిలర్ల పాదయాత్ర
జహీరాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదినం పురస్కరించుకుని బీఆర్‌ఎస్ నాయకులు నామ రవికిరణ్ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు బుధవారం సిద్ధివినాయక ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పట్టణం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర 15 కిలోమీటర్లు సిద్ధివినాయక ఆలయ వరకు కొనసాగింది. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్రవంతి, అన్నపూర్ణ, సుజిత, స్వప్న, పాండు, సర్పంచ్‌లు మహాదేవి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.


