జిల్లాలో బడిబాట షురూ
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బడిబాట ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అక్షయ, రెండో ర్యాంకు మేఘన, మూడో ర్యాంకు వచ్చిన లిప్సికను సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సాంబయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మాధురి, ఉపాధ్యాయులు వెంకటస్వామి, శ్రీనివాస్‌రావు, నరసింహారెడ్డి, చార్లెస్, అర్చన, అమూల్య, శైలజ, వెంకట్‌రెడ్డి, ధనరాజ్, వాణిశ్రీ, జయసుధ, విజయ మోహన్‌రాజ్, ప్రశాంతి దేవి, రేణుకా దేవి, రాము, రాధిక ప్రియదర్శిని, ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.


