గ్రామాలకు వస్తే సమస్యలు చూపిస్తాం | - | Sakshi
Sakshi News home page

గ్రామాలకు వస్తే సమస్యలు చూపిస్తాం

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ మంత్రులకు దమ్ముంటే గ్రామాలకు వస్తే కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను చూపిస్తామని ఎమ్మెల్యే సునీతారెడ్డి సవాల్‌ విసిరారు. ఆమె సోమవారం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు తనకు ఫోన్‌ చేసి కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను చెప్పి పరిష్కారానికి కృషి చేయాలని కోరారన్నారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని వివరించారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆమె కోరారు. అనంతరం ఓ దాడిలో గాయాల పాలై వైద్యం కోసం వచ్చిన క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు అశోక్‌గౌడ్‌, నయిం రమణాగౌడ్‌, సత్యంగౌడ్‌, భిక్షపతి, ప్రసాద్‌, రాజు, మోహిజోద్దీన్‌, రాకేష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

మంత్రులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి సవాల్‌

Advertisement
 
Advertisement
Advertisement