నర్సాపూర్: వరల్డ్ బైసైకిల్ డేను పురస్కరించుకుని బుధవారం అటవీశాఖ అధికారులు బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి దివ్య మాట్లాడుతూ.. 99రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. కాలుష్య నియంత్రణపై బాధ్యతగా ఉండాలన్నారు. అటవీశాఖ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్, సెక్షన్ ఆఫీసర్లు సాయిరాం, రాజమణి, శ్రీధర్ పాల్గొన్నారు.
కౌడిపల్లి ఎఫ్‌ఆర్‌ఓగా రవీందర్
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి అటవీశాఖ రేంజ్ అధికారిగా బి. రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎఫ్‌ఆర్‌ఓ అర్చన సిద్దిపేట ప్లయింగ్‌స్కాడ్‌కు బదిలీ అయ్యారు. రవీందర్ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. దీంతో పాటు కౌడిపల్లి రేంజ్ కార్యాలయం పరిధిలోని డీఆర్‌ఓ రాజమణి బదిలీపై వెళ్లగా పృద్వీరాజ్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. అంసాన్‌పల్లి సెక్షన్ అధికారిగా ఓంప్రకాష్, కొల్చారం సెక్షన్ అధికారిగా మల్లేశం, కౌడిపల్లి బీట్ అధికారిగా మమత బదిలీపై వచ్చి విధుల్లో చేరారు.
ఉద్యోగులకు
బదిలీలు సహజం
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కమలాపూర్ గ్రామకార్యదర్శి రాజుగౌడ్ బదిలీపై వెళ్లగా గ్రామసర్పంచ్ కుంట్ల సుజాత ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ గ్రామానికి చేసిన సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, మాజీ సర్పంచ్‌లు నార్సిమ్ రాములు, కుంట్ల రాములు, శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ లింగరాజు, గ్రామస్తులు ఉన్నారు.
అందుబాటులో
జనుము విత్తనాలు
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో సబ్సిడీపై జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఏఓ స్వప్న తెలిపారు. 40కిలోల బస్తా రూ.3,110లకు లభిస్తుందన్నారు. ఒక బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుందన్నారు. జనుము భూసారం పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్పా రు. కావాల్సిన రైతులు పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో సంప్రదించాలని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి
కేసుపై విచారణ
నిజాంపేట(మెదక్): మండల పరిధి వెంకటపూర్ కె గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ బుధవారం విచారణ చేపట్టారు. అనంతరం నిజాంపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కేసుకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతి, చట్టపరమైన చర్యలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీతో పాటు రామాయంపేట సీఐ సైదా, నిజాంపేట ఎస్‌ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.


