చిన్నశంకరంపేట(మెదక్): రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కపటప్రేమ చూపుతుందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. శనివారం చిన్నశంకరంపేటలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. మండలంలోని ఆగ్రహారంలో రైతు ధాన్యం కొనడం లేదని ఆత్మహత్యకు పాల్పడిన విషయం పత్రికల్లో చూసి .. ప్రధాన ప్రతిపక్షంగా గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాం. అంతే తప్ప శవరాజకీయాలు చేయలేదన్నారు. పరామర్శించడం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని విమర్శించడం కాంగ్రెస్ నాయకుల నోటి దురుసుకు నిదర్శనమన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సిద్దిరాములు, కృష్ణాగౌడ్, నరేష్, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, ప్రభాకర్, చందాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


