చేగుంట(తూప్రాన్): బ్యాడ్మింటన్ స్టేడియం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించినట్లు చేగుంట మండల బ్యాడ్మింటన్ క్లబ్ అధ్యక్షుడు విష్ణు తెలిపారు. మండలంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నప్పటికీ ఆటస్థలం లేకపోవడంతో ఆటలో నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. శ్రీనివాస్‌రెడ్డితో పాటు మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావును కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి ఆటస్థలం ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్లు చెప్పారు.


