మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెదక్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ బస్టాండ్, రైల్వే స్టేషన్, జిల్లా కలెక్టరేట్‌లో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. స్నిఫర్ డాగ్ ‘సింబ’ సహాయంతో ప్రాంగణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్సై రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు నర్సింహులు, రాజేశ్ పాల్గొన్నారు.


