కొనుగోళ్లు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగవంతం చేయండి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

అల్లాదుర్గం(మెదక్‌)/పాపన్నపేట: కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశించారు. బుధవారం మండలంలోని గడిపెద్దాపూర్‌ కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా మ్యాచర్‌ వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటివరకు సగం ధాన్యం కొనుగోలు చేసినట్లు ఐకేపీ సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జనగణను పరిశీలించారు. ప్రజల స్పందన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. టేక్మాల్‌ మండలం బర్ధిపూర్‌లో 20 రోజులుగా ధాన్యం కొనడం లేదని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. విచారణ చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను అదేశించారు. ఆమె వెంట తహసీల్దార్‌ మల్లయ్య, ఏపీఎం రుక్మిణి, సిద్దేశ్వర్‌ ఉన్నారు. అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎక్కడా హమాలీల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న జనగణనను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం, తహసీల్దార్‌ సతీష్‌, సర్పంచ్‌ శ్రీధర్‌, ఏపీఎం దత్తాత్రేయ, రైతులు ఉన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

విద్యకు అధిక ప్రాధాన్యం

హుస్నాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్‌ పై వర్క్‌షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్‌లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్సియల్‌ స్కూల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లకు సర్పంచ్‌లు వెళ్లి స్కూల్‌ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా విధ్యాశాఖ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, ఎంఈఓ బండారి మనీల, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్‌ పై వర్క్‌షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు.

బడుల బలోపేతమే లక్ష్యం

సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement