సమ్మేళనంలో అప్పటి ఉపాధ్యాయులు, విద్యార్థులు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని రేణుకా మాత ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 1996– 97 బ్యాచ్‌కి సంబంధించి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులను శాలువాతో సన్మానించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అప్పటి తీపి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాలయ్య, విద్యార్థులు నసీరుద్దీన్, మహేందర్, శివప్రసాద్, ప్రభుదాస్, ఎల్లం యాదవ్, నర్సింలు, ఎల్లం, యాదగిరి, రాము పాల్గొన్నారు.


