గజ్వేల్: రాబోయే నాలుగు రోజుల్లో వడ్లను పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాజీవ్ రహదారిపై 30 ట్రాక్టర్ల వడ్లను పోసి దిగ్బంధిస్తామని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం గజ్వేల్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి రైతులపై భారీ కుట్రకు తెరలేపాయని మండిపడ్డారు. వ్యవసాయ బోరు మోటా ర్ల వద్ద మీటర్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మీటర్ల బిగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తాం
ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి


