నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రమాదేవి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా కార్యాలయంలోని పలు విభాగాలను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం బీఎల్‌ఓలతో మాట్లా డా రు. ఓటరు జాబితాకు సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, తప్పులు దొర్లకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్ రమ్య శ్రీ, ఆర్‌ఎస్ ప్రీతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
చేగుంట(తూప్రాన్): రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న భూభారతి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను సైతం పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శివప్రసాద్, ఆర్‌ఐ భరత్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): ఉపాధి హామీ కూలీలు పని చోట తాగునీరు, టెంటు ఇతర వసలులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని మద్దుల్‌వాయి శివారులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఎండలు మండుతున్న దృష్ట్యా కూలీలకు తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల పంచాయతీ సెక్రటరీలు ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. ఆమె వెంట సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, నాయకులు సత్యనారాయణ, రాజు, నర్సింలు, మల్లేశం తదితరులు ఉన్నారు.
నిబంధనల్లో చేర్చిన ఇంటర్‌బోర్డు
నారాయణఖేడ్: ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థినిలకు భద్రతా కల్పించేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కళాశాల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, ఎకై ్సజ్, విద్యాసంస్థలు కలిసి పని చేస్తున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్ టీంను సైతం ఏర్పాటు చేశా యి. కళాశాలలు, హోటళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. పాఠశాల లు, కళాశాలల్లో డ్రగ్స్ ప్రమాదాలపై సెమినా ర్లు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం ఆధారంగా నిఘా, సమాచార సేకరణ, సీసీ టీవీల నిఘా పెంచడం, మాదకద్రవ్యాలతో పట్టు బడితే ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు.


