మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు చరిత్రకు ఆనవాళ్లని, వీటిని భవిష్యత్ తరాలకు అందించే చర్యలు చేపడుతామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుధవారం మెదక్ ఖిల్లాపై హెరిటేజ్ వాక్ నిర్వహించగా, కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల ఉనికి అందించేలా డాక్యుమెంటరీ తయారు చేస్తామన్నారు. మెదక్ పోర్ట్ అనేది చారిత్రాత్మక పర్యాటక ప్రాంతంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈనెల 22 రోజున హెరిటేజ్ ప్రాంతాలను హైలెట్ చేయడంలో భాగంగా ఖిల్లాపై అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు వెస్లీ పాఠశాల, మెదక్ చర్చిని, గుల్షన్ క్లబ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, మత్స్యశాఖ అధికారి మల్లేశం, యువజన, క్రీడల నిర్వహణ అధికారి రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీపీఓ యాదయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


