రైతులు అపోహలు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు అపోహలు నమ్మొద్దు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

డీసీఓ కరుణాకర్‌

డీసీఓ కరుణాకర్‌

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అపోహలను నమ్మొద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా సహకార శాఖ అధికారి కరుణాకర్‌ అన్నారు. శనివారం చిలప్‌చెడ్‌తో పాటు అజ్జమర్రి, బండపోతుగల్‌, ఫైజాబాద్‌ గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్నారు. ట్రాక్టర్లు ఉన్న వారు ధాన్యాన్ని తమ వాహనంలోనే మిల్లులకు తరలించాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రం నిర్వాహకులు, రైతుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. మిల్లుకు వెళ్లిన ధాన్యం వెంటనే ఖాళీ చేయించడం, గన్నీ బస్తాల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సొసైటీ సిబ్బందికి సూచించామన్నారు. ఆయన వెంట సొసైటీ సీఈఓ దత్తాత్రి, సిబ్బంది నర్సింహులు, రైతులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement