రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జోగిపేట కమిషనర్‌గా పని చేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారం, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నూతన కమిషనర్‌ను మున్సిపల్ చైర్మన్ లావణ్య, కౌన్సిలర్లు సన్మానించారు.
గోదాం పరిశీలన
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నందిగామలో మంగళవారం ధాన్యం నిల్వ చేయడానికి దుర్గారైస్ మిల్లును అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండల చుట్టూ పక్కల రైతులకు ధాన్యం తరలించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిగామలోని దుర్గా రైస్ మిల్లులో ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శేరి స్వప్న, గ్రామ ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, ఉప సర్పంచ్ అంజిరెడ్డి, సెంటర్ ఇన్‌చార్జి బాజ చందు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయండి
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని తహసీల్దార్ శివప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధి అజ్జమర్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ధాన్యం కొనుగోళ్లు వందశాతం పూర్తయ్యేలా చూస్తామన్నారు. రైతులకు ట్రాక్టర్లు అందుబాటులో ఉంటే, వాటిలోనే ధాన్యం తరలించాలన్నారు. కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు విజయలక్ష్మి, శ్రీహరి, జీపీఓ రాధాకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
పీఆర్ డిప్యూటీఈఈగా సీహెచ్ రాధికలక్ష్మి
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి పంచాయతీరాజ్ డివిజన్ డిప్యూటీఈఈగా సీహెచ్ రాధికలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన అమరేశ్వర్ నర్సాపూర్ బదిలీ అయ్యారు. నర్సాపూర్ నుంచి ఆమె ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు.
సేంద్రియ సాగుతో ప్రయోజనం
శివ్వంపేట(నర్సాపూర్): రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామిరెడ్డి అన్నారు. మంగళవారం పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 శాతం సబ్సిడీపై జీలుగ అందుబాటులో ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీలుగ వల్ల భూసారం పెరగడంతో పాటు ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, సీఈఓ మధు, డైరెక్టర్లు ఉన్నారు.
ఇరిగేషన్ డీఈగా ధర్మకుమార్
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట డివిజన్ ఇరిగేషన్ డీఈగా ధర్మకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బదిలీపై వచ్చారు. ఇక్క డ డీఈగా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు బదిలీపై వెళ్లారు.
దుకాణంలో చోరీ
తూప్రాన్: తాళం వేసిన దుకాణంలో మంగళ వారం రాత్రి చోరీ జరిగింది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం... పట్టణానికి చెందిన వ్యాపా రి రమేశ్ శ్రీసాయిరాం ట్రేడర్స్ నిర్వహిస్తున్నా డు. సోమవారం రాత్రి దుకాణం బంద్ చేసి ఇంటికెళ్లాడు. మంగళవారం వచ్చి చూసేసరికి షట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నా యి. లోపలికి వెళ్లి చూడగా డ్రాలో ఉన్న రూ.50 వేలు కని పించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.


