పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి, గొట్టిముక్కుల, ముసాపేట, బద్దారం తదితర గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా పేదలకు సొంత ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ ప్రసన్న, ఎంపీడీఓ క్రాంతికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, మురళిపంతులు, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, ఏఈ కౌశిక్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి


