‘ఖేడ్‌’ ఎమ్మెల్యే సంజీవరెడ్డి | - | Sakshi
Sakshi News home page

‘ఖేడ్‌’ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం

పెద్దశంకరంపేట(మెదక్‌): పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వరమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నా రు. గురువారం మండల పరిధిలోని మాడ్చెట్‌పల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. పేదలకు తక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకం తీసుకొచ్చిందన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్‌, సర్పంచ్‌ కుమార్‌, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement