ప్రజాసేవకు పరితపించే నేత హరీశ్‌రావు | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవకు పరితపించే నేత హరీశ్‌రావు

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

మెదక్‌జోన్‌: ఉద్యమ కాలం నుంచి అనునిత్యం ప్రజాసేవే ధ్యేయంగా పరితపించే నేత హరీశ్‌రావు అని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా పటణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు, రక్తదానం, అన్నదానం నిర్వహించారు. పలువురు నేతలతో కలిసి కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గులాబీ జెండాను చేతబట్టినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీశ్‌రావుని రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి ప్రతి జిల్లాను సందర్శిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరిచిన నాయకుడని కొనియాడారు.

మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement