నార్సింగి అభివృద్ధికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

నార్సింగి అభివృద్ధికి సహకరించండి

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రం అభివృద్ధికి సహకరించాలని ఇన్‌చార్జి జిల్లా మంత్రి వివేక్‌ వెంకటస్వామిని స్థానిక నాయకులు కోరారు. హైదరాబాద్‌ నుంచి నార్సింగి మీదుగా నిజామాబాద్‌ వైపు వెళ్తున్న మంత్రి గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ వైస్‌ ఎంపీపీ మల్లేశంగౌడ్‌, గ్రామపంచాయతీ సభ్యులు రవీందర్‌, బాచిస్వామి తదితరులు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. నూతన మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రెండు వైపుల బస్‌షెల్టర్లు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement