పాపన్నపేట(మెదక్): కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘం ఆర్జిస్తున్న లాభాల్లో 10 శాతం డివిడెంట్‌ను సభ్యులైన రైతులకు అందజేస్తున్నట్లు చైర్మన్ త్యార్ల రమేశ్ తెలిపారు. హైకోర్టు తీర్పు మేరకు సోమవారం పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ సొసైటీలో లేనివిధంగా లాభాల్లో రైతుల షేర్లను బట్టి 10 శాతం డివిడెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. సాధారణ సభ, పాలక మండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే, సొంతనిధులతో నిర్వహణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. త్వరలో సొసైటీకి చెందిన బంకులో సీఎన్‌జీ గ్యాస్ సేవలు కూడా అందించడానికి కృషిచేస్తున్నామని చెప్పారు. సొసైటీ భవనానికి మూడెకరాల స్థలాన్ని దానమిచ్చిన నత్తడి వీరప్ప కుటుంబ సభ్యులకు పాలకవర్గంలో డైరక్టర్ పదవి కల్పించేందుకు తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కిసాన్‌సెల్ అఽధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, పార్శి నర్సింహులు, మాజీ సర్పంచ్ పంతుల భూమన్న, ఇంద్రసేనారెడ్డి, డెరెక్టర్లు భీమప్ప, శోభారాణి, మహిపాల్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ, పోషరాజు, సంతోష, దుర్గమ్మ, జాఫర్,నర్సింహులు, శ్రీకాంతర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, సీఈఓ వెంకటేశ్వర్‌రెడ్డి, సిబ్బంది రవి, వెంకటేశం, రైతులు పాల్గొన్నారు.
కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘం
చైర్మన్ రమేశ్


