శివ్వంపేట(నర్సాపూర్): సాగు కోసం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన విలువైన అసైన్డ్ భూమి అన్యా క్రాంతం అవుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పేదలు సాగు చేపట్టాల్సిన భూమిని ఓ పరిశ్రమ నిర్వాహకులు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకొని వినియోగించుకుంటున్నారు. మండల పరిధి ఉసిరికపల్లి గ్రామ శివా రు, వెల్దుర్తి–ఉసిరికపల్లి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 220/ఊ లోని 30 గుంటల ప్రభుత్వ భూమిని సాగు కోసం గ్రామానికి చెందిన ఒక పేద రైతుకు గతంలో ప్రభుత్వం అసైన్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూమి.. గ్రామ శివారులో ఉన్న ఓ సిమెంట్ ఇటు కల తయారీ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉంది. సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్థాలను ఈ భూమిలోనే వేయడంతో పాటు, అక్కడ పనిచేసే కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలు నిర్మి ంచారు. ప్రభు త్వ రికార్డుల ప్రకారం సదరు భూమి ఇప్పటికీ అసైన్డ్ పొందిన వ్యక్తి పేరు మీదే ఉన్నప్పటికీ, పొజిషన్ మాత్రం పరిశ్రమ యాజ మాన్యం చేతుల్లో ఉంది. సాగు కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి లో యథేచ్ఛగా కమర్షియల్ కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు ఉదాసీన ంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
తిరిగి స్వాధీనం చేసుకోవాలి..
కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిశ్రమ యాజమాన్యం నుంచి తిరిగి స్వాధీనం చేసుకొని, ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, భూమిని సర్వే చేయించి.. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఓ పరిశ్రమ ఆధీనంలో
ప్రభుత్వ భూమి
రికార్డుల్లో ఒకరి పేరు..పొజిషన్‌లో మరొకరు
స్పందించని జిల్లా ఉన్నతాధికారులు


