ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం రైతులతో కలిసి కౌడిపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద లారీలు రాక, తూకం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఎక్కడ చూసిన ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. పంటల సాగుకు రైతుభరోసా రాక, సకాలంలో యూరి యా దొరకక రైతులు అవస్థలు పడ్డారన్నారు. చివరికి పంటను అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనగోలు చేయడంతో పాటు పెట్టబడి సాయం సకాలంలో ఇచ్చామన్నారు. రాస్తారోకోతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోగా, వివరమించాలని సీఐ జాన్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సతీశ్, నవీన్ రమేశ్, మహిపాల్‌రెడ్డి, సుమలత, కాంతారావు, నవీన్‌గుప్తా, దుర్గారెడ్డి, శ్యాంసుందర్‌రావు, ప్రవీణ్‌కుమార్, పురుషోత్తం, సాయాగౌడ్, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


