రోడ్డెక్కిన రైతన్నలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతన్నలు

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. దీంతో మెదక్‌– బోధన్‌ రోడ్డుపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రమైన హవేళిఘణాపూర్‌లో వారం రోజులుగా వరి ధాన్యం తూకం వేశారు. కానీ లారీలు రాక ధాన్యం తరలింపు నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింద ని ఆరోపించారు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయాలని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు కాంటాలు పూర్తయిన ధాన్యం త రలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.

వారం రోజులుగా నిలిచిన ధాన్యం తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement