చిన్నశంకరంపేట(మెదక్): రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని కామారం, నార్సింగి మండలం శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులను కదిలిస్తే కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో లేక రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌తో పాటు అదనపు కలెక్టర్ నగేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజు, బాబు, నాయకులు లక్ష్మారెడ్డి, గొండస్వామి తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి


