చేగుంట(తూప్రాన్): భూవివాదంలో ఇరువర్గాలు దాడి చేసుకున్న సంఘటన మండలంలోని జెత్రంతండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాలోని 85 సర్వే నంబర్‌లో వ్యవసాయ భూమిని నరేష్, రవీందర్ అనే వ్యక్తిలు రియల్ వ్యాపారులకు విక్రయించాడు. సంబంధిత భూమి కంటే ఎక్కువ భూమిని ఆక్రమించి కడ్డీలు వేసేందుకు రియల్ వ్యాపారి కొందరిని తీసుకొని తండాకు చేరుకున్నారు. పొలం ఎక్కువ భాగం ఆక్రమించి హద్దులు వేయడానికి వీలు లేదని చెప్పడంతో రియల్ వ్యాపారి తీసుకొచ్చిన వ్యక్తులు.. తండావాసులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి
టేక్మాల్(మెదక్): ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి చెందిన సంఘటన టేక్మాల్ మండల కుసంగి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముత్యంగారి శ్రీశైలం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. శనివారం అతని భార్య ముత్యంగారి రాణెమ్మ ఎడ్లను మేపడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. అవి మేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 33కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి అక్కడికక్కడే ఎద్దు మృతిచెందింది. రూ.85వేల విలువ గల ఎద్దు మృతి చెందడంతో బాధితులు బోరున విలపించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
చేగుంట(తూప్రాన్): కార్మికుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో చేగుంటలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. వేతన పెంపు నిర్ణయం కార్మికుల కుటుంబాల్లో ఎంతో సంతోషం వ్యక్తమవుతోందతని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, ఉపసర్పంచ్ రఫీ, నాయకులు పాల్గొన్నారు.
వెల్దుర్తి మండల కేంద్రంలో..
వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి కటౌట్‌కు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్మికుల జీతాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, మల్లేశం, మల్లేశంచారి, వెంకట్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.


