టేక్మాల్(మెదక్): గ్రామాల్లోని పేదలకు సేవలు చేయడం అభినందనీయమని అల్లాదుర్గం సీఐ రేణుకరెడ్డి అన్నారు. మంగళవారం టేక్మాల్ మండలంలోని మల్కాపూర్‌లో సర్పంచ్ వెంకటకృష్ణ అధ్యక్షతన 15మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి చదువుకునే విద్యార్థులకు సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నిరుపేద విద్యార్థినులు చదువుకు దూరం కావొద్దని సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. సైకిళ్లను పంపిణీ చేసిన రాధామనోహర్ ఫౌండర్ దాదాయిపల్లి సర్పంచ్ నర్సింహరావు దేశ్‌పాండేకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరాం, గడిపెద్దాపూర్ సర్పంచ్ హరి కృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం సీఐ రేణుకరెడ్డి


