వెల్దుర్తి(తూప్రాన్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాలకు నెలన్నర క్రితం ధాన్యం తీసుకొచ్చినా, కొనుగోళ్లు పూర్తి కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. గ్రామాల్లో 25 శాతం కొనుగోలు కూడా పూర్తి కాలేదన్నారు. ఆందోళనలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, నర్సింలు, అశోక్‌గౌడ్, శ్రవణ్‌కుమార్, మహేశ్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే చిలప్‌చెడ్ మండలంలోని పలు గ్రామాల్లో కొనుగో లు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, సర్పంచ్ అనిల్, నాయకులు, రైతులు ఉన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


