బక్రీద్ సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం పట్టణంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, రాందాస్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు విగ్రహం, చామన్ ప్రాంతాల మీదుగా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, శైలేందర్, రామకృష్ణ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
– మెదక్‌జోన్


