●రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.. ●అందుబాటులో వందలాది కంపెనీలు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రాన్ని బుధవారం ఎమ్మెల్సీలు డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, అంజిరెడ్డి సందర్శించారు. వారికి ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. కంపెనీలు సైతం అదనపు నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్రం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్ 2.0)ను తీసుకొచ్చింది. ఈ పథకంలో నిరుద్యోగులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, వందలాది కంపెనీలు అందుబాటులో ఉంటాయి. ఏదో ఒక కంపెనీ తీసుకొని శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది.
– మెదక్ కలెక్టరేట్
నైపుణ్య శిక్షణ..
భవితకు నిచ్చెన
నాట్స్ 2.0 అనేది గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్లకు వేతనంతో కూడిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ఐటీ ఆధారిత పోర్టల్. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఈ–కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్ సులభతరం అవుతుంది. గత ఐదేళ్లలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదే సమయంలో పరిశ్రమల ద్వారా 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అవకాశాలను కల్పిస్తారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (బీఓఏటీ) ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోర్టల్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు 6 నెలల నుంచి సంవత్సరం వరకు శిక్షణ ఉంటుంది. అర్హత కలిగిన ప్రతి అప్రెంటిస్‌కు నెలకు కనీసం రూ.7 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. ఇందులో 50 శాతం ఖర్చును అంటే రూ.3,500 కేంద్రం నేరుగా పరిశ్రమకు అందిస్తుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలకు చెల్లుబాటు అయ్యే నైపుణ్య ధ్రువపత్రం అందజేస్తారు. కాగా విద్యార్థులు పోర్టల్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్లు పొందవచ్చు. ఒక్కో విద్యార్థికి ఒక నమోదు మాత్రమే అవకాశం ఉంటుంది. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులు.
కలెక్టర్ దిశానిర్దేశం
నాట్స్–2.0 పథకంపై ఇటీవల జిల్లాలోని డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు పలు పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి సంవత్సరం విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థులకు నాట్స్– 2.0పై అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదన్నారు.


